కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్
దీప్తానలార్క ద్యుతిమప్రమేయమ్ ।। 17 ।।
కిరీటినం — కిరీటముతో అలంకరించబడి; గదినం — గదతో; చక్రిణం — చక్రములతో; చ — మరియు; తేజః-రాశిం — తేజోమయముగా; సర్వతః — అంతటా; దీప్తి-మంతమ్ — వెలుగుతూ; పశ్యామి — నేను చూచుతున్నాను; త్వాం — నిన్ను; దుర్నిరీక్ష్యం — చూడటానికి కష్టముగా; సమంతాత్ — అనీ దిశలా; దీప్త-అనల — రగిలే అగ్ని; అర్క— సూర్యుని వంటి; ద్యుతిమ్ — తేజస్సు; అప్రమేయం — అపరిమితమైన.
Translation
BG 11.17: కిరీటముతో, చక్ర-గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది.
Commentary
ఏదేని అత్యంత ప్రకాశంతో ఉన్న వస్తువును చూస్తే ప్రాకృతిక కన్నులు బైర్లు కమ్ముతాయి. అర్జునుడి ముందు ఉన్న విశ్వ రూపము, వెయ్యి సూర్యుల తేజస్సు కంటే మించిన ప్రకాశంతో ఉంది. సూర్యుడు కన్నులను మిరుమిట్లు గొలిపినట్టు, ఆ విశ్వ రూపము కూడా చూడటానికి మహాతేజస్సుతో ఉన్నది. భగవంతుని నుండి దివ్యదృష్టి అందినది కాబట్టే అతను దానిని దర్శించగలుగుతున్నాడు.
ఆ విశ్వరూపము యందు, అర్జునుడు చతుర్భుజములతో ఉన్న విష్ణు మూర్తి స్వరూపాన్ని దర్శించాడు; అది సుపరిచితమైన నాలుగు చిహ్నములను కలిగిఉన్నది - గద, శంఖము, చక్రము, మరియు తామర పువ్వు.