సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ।। 9 ।।
సంజయః ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం — ఈ విధంగా; ఉక్త్వా — పలికిన పిదప; తతః — అప్పుడు; రాజన్ — రాజా; మహా-యోగ-ఈశ్వరః — సర్వోన్నత యోగేశ్వరుడు; హరిః — శ్రీ కృష్ణుడు; దర్శయామ్-ఆస — చూపించెను; పార్థాయ — అర్జునుడికి; పరమం — దివ్యమైన; రూపమ్ ఐశ్వరమ్ — వైభవోపేత రూపమును.
Translation
BG 11.9: సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.
Commentary
అర్జునుడు శ్రీ కృష్ణుడిని 11.4వ శ్లోకంలో ‘యోగేశ్వర’ అని సంబోధించాడు. ఇక ఇప్పుడు, సంజయుడు ఆయనను ‘మహా-యోగేశ్వరా’ అని అంటున్నాడు, యోగేశ్వరుడికి ‘మహా’ అన్నఅతిశయోక్తి జత చేసాడు. సంజయునికి తన గురువు వేద వ్యాసునిచే దూర దృష్టి వరం ఇవ్వబడింది. కాబట్టి, ఆయన కూడా భగవంతుని విశ్వ-రూపమును అర్జునుడు చూసిన విధముగానే చూసాడు. ఇక తదుపరి నాలుగు శ్లోకాలలో, సంజయుడు దృతరాష్ట్రునుకి, అర్జునుడు ఏమి చూసాడో అది చెప్తున్నాడు. భగవంతుని విశ్వరూపము ఆయన ఐశ్వర్యములతో నిండి ఉంటుంది, మరియు అది చూసేవారిలో భయాన్ని, ఆశ్చర్యాన్ని, మరియు పూజ్యభావాన్ని కలిగిస్తుంది.