Bhagavad Gita: Chapter 17, Verse 21

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ।। 21 ।।

యత్ — ఏదయితే; తు — కానీ; ప్రతి-ఉపకార-అర్థం — ఏదో ఉపకారము ఆశించి; ఫలమ్ — ఫలము; ఉద్దిశ్య — ఆశించి; వా — లేదా; పునః — మళ్ళీ; దీయతే — ఇవ్వబడుట; చ — మరియు; పరిక్లిష్టం — అయిష్టముగా; తత్ — అది; దానం — దానము; రాజసం — రజో గుణము లో; స్మృతమ్ — అని చెప్పబడినది.

Translation

BG 17.21: కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.

Commentary

అడగక ముందే ఇవ్వటమే, దానము చేయుటకు అతిశ్రేష్ఠమైన పద్ధతి. అలాచేయకపోతే, ద్వితీయ శ్రేణి శ్రేష్ఠపద్ధతి ఏమిటంటే, అడిగినప్పుడు సంతోషముగా ఇవ్వటం. మూడవ స్థాయి దానం చేసే స్వభావం ఏమిటంటే, అడిగినప్పుడు అయిష్టముగా ఇవ్వటం, లేదా ఇచ్చిన తరువాత, ‘అంత ఎందుకు ఇచ్చానా? కొంచెం తక్కువ ఇస్తే సరిపోయేది’ అని విచారించటం. శ్రీ కృష్ణుడు ఇటువంటి దానమును రజోగుణ దానము అని పేర్కొంటున్నాడు.