Bhagavad Gita: Chapter 8, Verse 17

సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః ।
రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ।। 17 ।।

సహస్ర — వెయ్యి; యుగ — యుగము; పర్యంతం — వరకూ; అహః — ఒక రోజు; యత్ — ఏదైతే; బ్రహ్మణః — బ్రహ్మ యొక్క; విదుః — తెలుసుకొనుము; రాత్రిం — రాత్రి; యుగ-సహస్ర-అంతాం — వెయ్యి యుగములు ఉంటుంది; తే — వారు; అహః-రాత్ర-విదః — అతని రాత్రి పగలు తెలిసినవారు; జనాః — జనులు.

Translation

BG 8.17: వెయ్యి చతుర్యుగము (మహాయుగము) ల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు (కల్పము) అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నట్టు.

Commentary

వైదిక ప్రామాణంలో కాలం యొక్క కొలతలు కూడా విస్తారమైనవి. ఉదాహరణకి, కొన్ని పురుగులు రాత్రి పూట పుడతాయి — అవి పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, గుడ్లు పెడతాయి, మరియు వృద్ధాప్యంలోకి వస్తాయి, ఇవంతా ఒక్క రాత్రి లోనే జరిగిపోతాయి. పగటి పూట అవన్నీ వీధి దీపం కింద చనిపోయిపడి ఉండటం మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పురుగులకు, మీ జీవిత కాలం మొత్తం కలిపి మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే, వాటికి అది నమ్మశక్యంగా ఉండదు.

ఇదే విధంగా, వేదముల ప్రకారం, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల ఒక పగలు ఒక రాత్రి, భూలోకంలో ఒక సంవత్సరం అవుతుంది. దేవతల యొక్క ఒక సంవత్సరం, 30 రోజులు x 12 నెలలు, భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. దేవతల 12,000 సంవత్సరాలు, భూ లోకంలో ఒక మహాయుగం (నాలుగు యుగాల చక్రం) అవుతుంది; అంటే 4,320,000 సంవత్సరాలు. (12,000 దేవతా సంవత్సరాలు X 360 భూలోక సంవత్సరాలు)

ఇటువంటి 1000 మహా యుగములు బ్రహ్మ దేవుడికి ఒక పగలు. దీనినే కల్పము అంటారు, ఇది కాలాన్ని కొలవటానికి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ప్రమాణం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి కూడా ఇంతే సమయం ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం, బ్రహ్మ దేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. భూలోక లెక్క ప్రకారం ఇది 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు.

ఈ ప్రకారం వైదిక శాస్త్రం ప్రక్కరం కాలం యొక్క ఈ క్రింది విధంగా ఉంది:

కలి యుగము : 432,000 సంవత్సరాలు.
ద్వాపర యుగము : 864,000 సంవత్సరాలు.
త్రేతా యుగము : 1,296,000 సంవత్సరాలు.
సత్య యుగము : 1,728,000 సంవత్సరాలు

ఇవన్ని కలిపి ఒక మహా యుగం అంటే 4,320,000 సంవత్సరాలు.

వెయ్యి మహాయుగములు బ్రహ్మ దేవుని ఒక పగలు, కల్పము అంటే అదే : 4,320,000,000 ల భూలోక సంవత్సరాలు. ఇంతే సమయం బ్రహ్మ దేవుని రాత్రి. ఇది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే నిజంగా పగలు, రాత్రిని అర్థం చేసుకున్నట్టు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.

ఈ సమస్త విశ్వం యొక్క వ్యవధి బ్రహ్మ గారి జీవిత కాలం అయిన 100 సంవత్సరాలు: 311 ట్రిలియన్ 40 బిలియన్ భూలోక సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఒక జీవాత్మనే, ఆ పదవిని పొంది, భగవంతుని పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూఉంటాడు. కనుక, బ్రహ్మ కూడా జనన-మరణ చక్రం లోనే ఉంటాడు. కానీ, మహోన్నతమైన పరిణితి పొంది ఉండటం వలన, ఆయన జీవిత కాలం తరువాత ఆయన జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయబడి, భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని ఆయనకు హామీ ఉంది. ఒక్కోసారి, సృష్టి సమయంలో బ్రహ్మ పదవి నిర్వహించటానికి ఏ జీవాత్మకి కూడా అర్హత లేకుంటే, భగవంతుడే బ్రహ్మ అవుతాడు.