పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వృక-ఉదరః — భీముడు, గొప్పగా భుజించేవాడు.
Translation
BG 1.15: హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
Commentary
శ్రీ కృష్ణుడికి వాడబడిన 'హృషీకేశః' అన్న పదం, ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది. శ్రీ కృష్ణుడు తన యొక్క, మరియు అందరి యొక్క మనసు, ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి. తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు, ఇంద్రియముల పై కృష్ణుడు, పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు.