అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।
అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథా-భాగం — మీ మీ స్థానంలో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.
Translation
BG 1.11: కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.
Commentary
శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి, సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే, భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు.