స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ।। 19 ।।
సః — అట్టి; ఘోషః — శబ్దము; ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; హృదయాని — గుండెలను; వ్యదారయత్ — బ్రద్దలు చేసెను; నభః — ఆకాశము; చ — మరియు; పృథివీం — భూమి; చ — మరియు; ఏవ — నిజముగా; తుములః — భీకరమైన శబ్దం; అభ్యనునాదయన్ — ప్రతిధ్వనింపచేయుచు.
Translation
BG 1.19: ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
Commentary
పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బ్రద్దలుచేసింది. అయితే, కౌరవ సైన్యం తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క, కౌరవులు, తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనఃసాక్షిలో నేరం చేసాము అన్న వేదన వల్ల, ఓటమి భయానికి లోనయ్యారు.