ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।
బుధ్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ।। 39 ।।
ఏషా — ఇప్పటివరకు; తే — నీకు; అభిహితా — తెలుపబడినది; సాంఖ్యే — విశ్లేషణాత్మక జ్ఞానం ద్వారా; బుద్ధిః యోగే — బుద్ధి యోగం ద్వారా; తు — నిజముగా; ఇమాం — ఇది; శృణు — వినుము; బుధ్ధ్యా — అర్థం చేసుకోవటం ద్వారా; యుక్తః — కలిసి; యయా — దేని వలన అయితే; పార్థ — అర్జున, ఫ్రిథ పుత్రుడా; కర్మ-బంధం — కర్మ బంధము; ప్రహాస్యసి — నుండి నీవు విముక్తి చెయ్యబడెదవు.
Translation
BG 2.39: ఇప్పటివరకు, నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు, నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.
Commentary
సాంఖ్య అన్న పదం, సాన్, అంటే ‘సంపూర్ణముగా’ మరియు ‘ఖ్యా' ,అంటే ‘తెలుసుకొనుట’ అన్న మూల ధాతువుల నుండి వచ్చింది. కాబట్టి 'సాంఖ్య' అంటే ‘ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం’ అని అర్థం. భారతీయ తత్త్వశాస్త్రంలోని ఆరు తాత్త్విక గ్రంథాలలో ఒకటైన 'సాంఖ్య దర్శనం', బ్రహ్మాండములోని పదార్థములకు ఒక విశ్లేషణాత్మక వివరణ తెలుపుతుంది. అది ఇరవై నాలుగు అస్తిత్వాలను లెక్కిస్తుంది: పంచ-మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం), పంచ తన్మాత్రలు (పదార్థం యొక్క ఐదు నైరూప్య లక్షణాలు- రుచి, స్పర్శ, వాసన, శబ్దం, మరియు దృశ్యం), పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, అహంకారము (మహాన్ యొక్క పరిణామముచే జనించినది), మహాన్ (ప్రకృతి యొక్క పరిణామముచే జనించినది), ప్రకృతి (పదార్థ శక్తి యొక్క ఆదిమ రూపం). ఇవన్నీ కాక మరియొకటి, ప్రకృతిని అనుభవించగోరి, దానిలో బంధించబడే, పురుషుడు లేదా ఆత్మ.
శ్రీ కృష్ణుడు ఇందాక అర్జునుడికి, 'సాంఖ్య' యొక్క ఇంకొక స్వరూపాన్ని, అంటే, నిత్యశాశ్వతమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేయబోవుచున్నానని అంటున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద అనాసక్తి అవసరం. ఇటువంటి నిర్మోహము/నిర్లిప్తత అనేవి బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చెయాలి. అందుకే, ఆసక్తికరంగా శ్రీ కృష్ణుడు దీనిని 'బుద్ధి యోగము' అన్నాడు. తదుపరి శ్లోకాలలో (2.41 మరియు 2.44), ఈ యొక్క నిర్మోహ/నిర్లిప్త/అనాసక్త స్థితికి మనస్సుని తీసుకురావటానికి బుద్ధి యొక్క పాత్ర ఏమిటో, శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.