Bhagavad Gita: Chapter 18, Verse 32

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।।

అధర్మం — అధర్మము; ధర్మం — ధర్మము; ఇతి — ఈ విధముగా; యా — ఏదైతే; మన్యతే — ఊహిస్తారో (భావిస్తారో); తమస-ఆవృతా — చీకటిలో కప్పివేయబడి; సర్వ-అర్థాన్ — అన్ని విషయములలో; విపరీతాన్ — విరుద్ధముగా; చ — మరియు; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — ప్రిథ పుత్రుడా; తామసీ — తామసిక గుణములో ఉన్నట్టు;

Translation

BG 18.32: ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.

Commentary

తామసిక బుద్ధి అనేది పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితమై ఉండదు. కాబట్టి అది అధర్మమునే తప్పుగా ధర్మము అని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తి/అనుబంధంతో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, అంధకారముచే కప్పివేయబడినదై, తనకు తానే స్వయంగా చేసుకునే తీవ్ర హానిని కూడా గ్రహించలేడు, ఇది ఎంత బలీయంగా ఉంటుందంటే ఇంకొక మద్యంసీసా కోసం తన ఆస్తిని కూడా అమ్మటానికి వెనుకాడడు. తామసిక బుద్ధిలో, విచక్షణా జ్ఞానము మరియు తర్కబద్ధ వివేచన అనేవి కోల్పోబడుతాయి.